ప్రజల ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువస్తున్న ప్రజా పాలన ప్రభుత్వం…
-ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి : గోదావరిఖని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా సంక్షేమం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక రంగాల్లో స్పష్టమైన కార్యాచరణను చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి వారం ఒక ముఖ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
పారదర్శక పాలనతో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY