దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
వర్షంలో సైతం జోరుగా హుషారుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ..
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందజేస్తాం.
సాక్షిత :నెల్లూరు బ్యూరో ఉదయగిరి
.ఉదయగిరి గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో మట్ల.లక్ష్మయ్య.మాట్లాడుతూ.దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ… ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్న మరోవైపు మా మన ఫౌండేషన్ అది నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొన్నేటి వెంకటరెడ్డి సూచనలతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న పిలుపుతో వర్షంలో సైతం లెక్కచేయకుండా జోరుగా హుషారుగా. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు మండల కేంద్రమైన ఉదయగిరిలో గొల్లపాలెం పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ ను అందజేశామని గవర్నమెంట్ ఉద్యోగి కంటే ముందుగా వృద్ధులైన వారికి వెదంతులకు వికలాంగులకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం జరుగుతుందని ఉదయగిరి అభివృద్ధి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కే సాధ్యమని, మట్ల లక్ష్మయ్య అన్నారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వృద్ధులకు మహిళలకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత దక్కుతుందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగ గ్రామంలో ఇంటి వద్దకే వచ్చి, పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్స్ ను సకాలంలో అందుతుందా ఎంత వస్తుంది మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని మట్ల లక్ష్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు మట్ల శాంతి మట్ల లక్ష్మయ్య టిడిపి నేతలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
