పేదల ఆసరాగా పెద్దపల్లి ఆసుపత్రి…
ఆధునిక పద్ధతుల్లో విజయవంతమైన శస్త్రచికిత్సలు…
సాక్షిత పెద్దపల్లి//జమ్మికుంట మండలానికి చెందిన 50 సంవత్సరాల ఒక మహిళ, సిపిడిఓ కార్యాలయంలో సూపర్వైజర్‌గా పనిచేస్తూ, గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా డి డబ్ల్యు ఓ పెద్దపల్లి గారు స్పందించి, మాతా శిశు ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని జిల్లా ఆసుపత్రి పెద్దపల్లికి వెళ్లాలని సూచించారు.
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా గర్భాశయంలో గడ్డ ఉన్నట్లు గుర్తించారు.
ఇదే సమయంలో, చికురాయి (పెద్దపల్లి జిల్లా)కు చెందిన 42 సంవత్సరాల మరో మహిళ కూడా తీవ్రమైన రక్తస్రావంతో జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇద్దరు పేషెంట్లను పరిశీలించిన అనంతరం, నిపుణులైన వైద్యుల బృందం ఆధునిక వైద్య పద్ధతిలో హిస్టరెక్టమీ (గర్భాశయ తొలగింపు) శస్త్రచికిత్సను ఈరోజు విజయవంతంగా నిర్వహించి గడ్డలను తొలగించారు.
ఓదెలకి చెందిన 32 సంవత్సరాల మహిళకు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా గాల్ బ్లాడర్ నెక్ లో స్టోన్ ఉంది అని కనుక్కోవడం జరిగింది. అధునాతన పద్ధతిలో లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఆపరేషన్ ను, టుబెక్టమి విజయవంతంగా నిర్వహించడం జరిగింది, నిమ్మనపల్లి కి చెందిన 55 సంవత్సరాల మహిళ తీవ్రమైన కుడివైపు కడుపునొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది పరీక్షలు చేసుకోగా గాల్ బ్లాడర్ నెక్ లో స్టోన్ ఉంది అని కనుక్కోవడం జరిగింది. సదరు పేషెంటుకు కూడా అధునాతన పద్ధతిలో లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఇట్టి సర్జరీల లో పాల్గొన్న వైద్యుల బృందం లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమర సింహా రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ అనసూయ, డాక్టర్ మీరాజ్, డాక్టర్ రవళిక, అనేస్తేషియా డాక్టర్ స్వాతి, డాక్టర్ భవాని. ఈ ఆపరేషన్ లలో సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ కూడా పాల్గొన్నారు, ఈ నాలుగు సర్జరీలు చేసిన వైద్య బృందాలను,ఓ టి సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
అదేవిధంగా ప్రజలందరూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న నవజాత శిశు కేంద్రం సేవలు, 2 డి ఎకో సేవలు, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు, యూరాలజీ సేవలు మరియు రూట్ కెనాల్ సేవలను ఉపయోగించుకోవాలని, ఈ సేవలలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనచో నేరుగా సూపరింటెండెంట్ ని కలవచ్చు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భం గా ప్రజలందికి సూపరింటెండెంట్ చేయు విజ్ఞప్తి ఏమనగా వారికి సంబందించిన పేషెంట్ హాస్పిటల్ లో ఉన్న సమయం లో సానిటేషన్ గురించి గాని, వాష్ రూమ్ శుభ్రత గురించి గాని ఎవరైనా డబ్బులు అడిగినా గాని, ఏ ఇతర సమస్య ఉన్నా కూడా నర్సింగ్ సూపరింటెండెంట్ ని,ఆర్ ఎం ఓ ని, నేరుగా సూపరింటెండెంట్ ని సంప్రదిoచగలరు, లేని యెడల ఫిర్యాదులను కంప్లైంట్ బాక్స్ లో ఇవ్వవచ్చు, వారి సమస్యని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం అని సూపరింటెండెంట్, తెలియచేయడమైనది, ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని రకముల సేవలు ఉచితం ఎవ్వరికి లంచం ఇవ్వరాదు అని తెలియచేసారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
