పీర్ల గూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం
గ్రామాలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి
షమీమా బేగంను భారీ మెజారిటీతో గెలిపించాలి
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
ఫరూఖ్ నగర్ మండలంలోని పీర్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి షమీమా భేగం కత్తెర గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. పీర్లగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి . ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, గ్రామాల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.. గత రెండు సంవత్సరాలుగా మనం చేసిన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు.. ప్రజలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాలు, మహిళలకు ఉచిత బస్సు, 500 లకే గ్యాస్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు.. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు షాద్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంకల్ల చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ మురళి అప్పి, మైనారిటీ నాయకులు ఖాదర్ ఘోరీ, నవాజ్ ఘోరీ అదేవిధంగా పీర్లగూడెం గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
