మైనార్టీల సంక్షేమానికి మన ప్రభుత్వం పెద్దపీట వేసింది
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 లక్షలతో కొడవలూరులో షాది మంజిల్ పునరుద్ధరణ
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నెల్లూరు జిల్లా కొడవలూరులో షాదిమంజిల్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు కొడవలూరు టిడిపి,మైనార్టీ నాయకులు, మైనార్టీ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ వివాహాది శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ హాల్స్ ఖర్చులు భరించలేని పేద, మధ్య తరగతి ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఈ షాధీమంజిల్ఆధునీకరించామన్నారు.
కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం బడ్జెట్లో 5 వేల 434 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 173 కోట్ల 57 లక్షల రూపాయలు కేటాయించారనివారు పేర్కొన్నారు. కూటమి ప్రభత్వ పాలనలో మసీదులలో ఇమామ్‌లకు నెలకు 10 వేలు మౌజన్‌లకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనాలను అందిస్తున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగాప్రస్తావించారుఅనంతరం స్థానిక స్థానిక ముస్లిం యువకులు నిర్వహిస్తున్న స్వక్షంద సంస్థ ద్వారా చేపట్టిన రైస్ బ్యాగ్ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్లు నాయుడు, విశ్వం, మైనారిటీ నాయకులతో పాటు కొడవలూరు మండల తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
