తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ
** ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సత్యకుమార్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తుడా ఆఫీస్ వద్ద రాష్ట్ర మంత్రికి , స్థానిక ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులుకి బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అమ్మవారి దర్శనం ఏర్పాట్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ లు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, ఆలయ ఈవో జయకుమార్, బీజేపీ నాయకులు లోక ప్రభాకర్ నాయుడు, అనూష రామకృష్ణ, దీపక్ యాదవ్, చంద్రశేఖర్ రాయల్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సాయి ప్రసాద్, వరప్రసాద్, పొనగంటి భాస్కర్, నవీన్ రాయల్, రెడ్డి బాబు, పార్థసారథి, మల్లకుప్పం శేఖర్, ఆదం అనిల్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
