మక్కల లిఫ్టింగ్‌లో జాప్యం వద్దు.. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోండి…
కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు మరియు లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, జూలపల్లి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాలు, అలాగే ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాల్లో నిల్వలు, కొనుగోలు పరిస్థితులు, లోడింగ్ మరియు రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మక్కల లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. రవాణా విషయంలో లారీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను వినియోగించి మక్కల రవాణాను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ధర్మారం మార్కెట్ యార్డును పరిశీలించిన కలెక్టర్, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని నిబంధనల ప్రకారం పరీక్షించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు, లిఫ్టింగ్, రవాణా ప్రక్రియలు సమన్వయంతో సాగాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మ పోచాలు, జూలపల్లి తహశీల్దార్ దత్తు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
