కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) బతుకమ్మ పండుగ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట, రాజీవ్ గృహ కాల్ప లో నల్లమల్లిస్ ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్ పర్సన్ శ్రీమతి. నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి ( రాధ) నిర్వహించిన 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యతిథులుగా *కార్మిక మరియు గనుల శాఖామంత్రి వర్యులు డా || గడ్డం . వివేక్ వెంకట స్వామి , తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్ రెడ్డి రాం రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, విశిష్ట గోల్డ్&డైమండ్ అధినేత శ్రీ పల బట్ల ఆనంద్ * పాల్గొన్నారు. అనంతరం ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థికి 5000 రూ . స్కాలర్ షిప్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు కే. సరిత, శ్రీదేవి ,అరుణ , రాధిక, అనంతలక్ష్మి, స్రవంతి, శశికళ, పల్లా శశికళ, విజయశ్రీ, అనిత, పద్మ, సరిత, వీణ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
