నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన నర్సారెడ్డి భూపతి రెడ్డి .
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరి నాయకుల్ని కలుపుకొని పోవాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని. పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలని, భవిష్యత్తులో మేడ్చల్ జిల్లాలో జరగబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
