కోదాడ పట్టణం లో గంజాయి నిర్మూల లక్ష్యంగా నార్కోటి డాగ్ ‘రోలెక్స్’ తనిఖీలు..
సాక్షిత:
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది సోమవారం కోదాడ పట్టణ కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ తెలిపినారు. పట్టణంలో గాంజా లాంటి మాదకద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో కోదాడ పట్టణ కేంద్రంలో బస్టాండ్, హోటల్స్, టీ దుకాణాలు, మెడికల్ దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మద్యం దుకాణాలు,బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగినది అన్నారు.
ప్రస్తుత సమాజంలో గాంజాయి లాంటి మాదకద్రవ్యం మన యువతని సమాజాన్ని పట్టిపీడిస్తుందని దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని అన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని అన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించేవారు ఉన్నా సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకుతెలియజేయాలని కోరారు. యువత పౌరులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని గంజాయి యువతను పట్టిపీడిస్తుందని దీనిని క్షేత్రస్థాయిలోనిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఐ తెలిపారు. గంజాయి రహిత కోదాడ పట్టణంగా నిర్మించడంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
