బొల్లాను ఘనంగా సన్మానించిన నర్ర మారెళ్ళ గ్రామపంచాయతీ టిడిపి నాయకులు
కనిగిరి సాక్షిత:
కనిగిరి నియోజకవర్గం పామూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బొల్లా నరసింహారావును సోమవారం మహాలక్ష్మి మిల్క్ డైరీలో మండలంలోని నర్ర మారెళ్ళ గ్రామపంచాయతీ టిడిపి నాయకులు శాలువతో సత్కరించి అభినందించారు. నర్ర మారెళ్ళ గ్రామపంచాయతీ టిడిపి నాయకులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గుంటుపల్లి దశరధ రామయ్య, టిఎన్ఎస్ వి జిల్లా కార్యదర్శి పోక నాయుడు బాబు, గుంటుపల్లి సుబ్బరాయుడు, గుంటుపల్లి చెంచురామయ్య, చిట్టెటి మాల కొండయ్య, దగ్గుల రవీంద్ర రెడ్డి, గ్రామ టిడిపి అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, ఈదల వెంకటరమణయ్య, పోక శంకర్, గంధం పప్పు దాస్, గంధం రాజారత్నం, తదితర టిడిపి శ్రేణులు బొల్లా నరసింహారావును సన్మానించి, అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
