విద్య, వైద్యానికి మాజీ సీఎం జగన్ ప్రత్యేక ప్రాధాన్యత
** ప్రెస్ మీట్ లో భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు మేలు చేసేందుకే, పేదలకు మంచి జరగాలనే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రయివేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు.
తిరుపతిలో నిలోఫర్ హాస్పిటల్ కు మిన్నగా టిటిడి శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. 2021 లో బ్రహ్మోత్సవాలకు చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించారు. 2022లో గుండె మార్పిడులు కూడా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి గుండె మార్పిడి పరికరాలు అందుబాటులోకి తెచ్చాం అన్నారు. ఇప్పటి వరకు మూడువేలకు పైగా ఓపెన్ హార్ట్స్ సర్జరీలు , 15 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే 15 గుండె మార్పిడులు చేస్తే…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేసారు, ఏడాదిన్నర కాలంలో
వెయ్యి ఆపరేషన్లు పూర్తి చేయలేదని విమర్శలు చేశారు. 80 శాతం పైగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తిరుపతిలో పూర్తయ్యాయన్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 20 శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేక పోయారని పేర్కొన్నారు. 15 విభాగాలతో శ్రీపద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం,
రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రి కు 200 కోట్లు తో మూడు దశల్లో పనులు చేపట్టాం అన్నారు.
క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం, పీజీ హాస్టల్ భవనం, రుయాలో డయాగ్నోసిస్ బ్లాక్ ను నూతన భవనాలు నిర్మించామని చెప్పారు. న్యూరాలజీ, కార్డియాలజీ బ్లాక్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ప్రస్తుత టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు స్విమ్స్ ఆధునీకరణ అవసరం లేదన్నారని భూమన విమర్శించారు. స్విమ్స్ హాస్పిటల్ ఐపి బ్లాక్ నిర్మాణం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన లో అన్నారు.
