మహిళలకు నారా భువనేశ్వరమ్మ ఆదర్శం
** విజయోత్సవ సభలో “తుడ” చైర్మన్ డాలర్స్
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: రాష్ట్రంలోని మహిళామణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరమ్మ ఆదర్శనీయమని “తుడ” చైర్మన్ అండ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “స్త్రీశక్తి పథకం” విజయవంతం కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రగిరి లో విజయోత్సవ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అశేష మహిళా జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. తుడ చైర్మన్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులు చేయాలన్న సంకల్పంతో 1995లో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందన్నారు. అలాగే తన తండ్రి స్ఫూర్తితో యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ సైతం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి మహిళ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను తీసుకువస్తున్నారని తెలిపారు. గతంలో మగవాళ్లు మాత్రమే కుటుంబ పోషణ చేసుకునే వారని….అయితే ఇప్పుడు మహిళలు కూడా ఆర్థికంగా ఎదగడంతో పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుం టున్నారని పేర్కొన్నారు.
నిజం గెలవాలన్న పేరుతో రాష్ట్రమంతా పర్యటించ డమే కాకుండా కుప్పంలో ప్రతి పల్లెకు, ప్రతి గడపకు తిరిగి తన భర్తను అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్న నారా భువనేశ్వరమ్మ నేటి మహిళలకు ఆదర్శమన్నారు. నారా భువనేశ్వరమ్మ స్ఫూర్తితో చంద్రగిరి నియోజకవర్గంలో రాక్షసులతో పోరాడి తన ప్రాణానికి తెగించి తన భర్తను గెలిపించుకున్న పులివర్తి సుథ పోరాటం స్ఫూర్తిదాయకమని అభినందనలు తెలిపారు.
కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా లెక్కచేయకుండా మహిళలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
పులివెందుల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పులివెందులలో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో ఓ మహిళ చేతిలో ఘోరంగా ఓడిపోయి పులివెందుల పిల్లి అయ్యారని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే 100 శాతం విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
