ప్రజలకు దగ్గరగా న్యాయ సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం..
వర్ధన్నపేటలో త్వరలో మున్సిఫ్ కోర్టు – తాత్కాలిక భవన పరిశీలన పూర్తి..
న్యాయ సేవలు సులభతరం చేయడంలో మరో ముందడుగు – వర్ధన్నపేటలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు..
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే న్యాయం….
వర్ధన్నపేట అభివృద్ధిలో కీలక మైలురాయి – మున్సిఫ్ కోర్టు ఏర్పాటు..
వర్ధన్నపేట పాత మున్సిపాలిటీ భవనాన్ని పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని పాత మున్సిపాలిటీ భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నిర్మలా గీతాంబ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును తాత్కాలికంగా ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, సకాలంలో అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న న్యాయ సమస్యల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే న్యాయం పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు..
న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత దగ్గర కావడం ప్రజాస్వామ్యానికి బలమని, మున్సిఫ్ కోర్టు ఏర్పాటు వర్ధన్నపేట ప్రాంత అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియకు సహకరించిన జిల్లా న్యాయ విభాగ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఎమ్మెల్యే నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్, కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుధీర్, పోలీస్ ఎసిబి నర్సయ్య, ఎస్సై సాయిబాబా తో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
