చేవెళ్ల నియోజకవర్గం:-
పేదల సొంతింటి కల నెరవేరింది:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
చేవెళ్ల మండలం గుండాల గ్రామ వాసి, మంగళి లక్ష్మమ్మ కి ప్రభుత్వం తరుపున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో వారు నూతనంగా నిర్మించిన “ఇందిరమ్మ ఇంటిని” చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజల సొంతిటి కల నెరవేరిందన్నారు. నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గుండాల గ్రామంలో ప్రారంభించామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

