ఆరోగ్య పథకాలపై అవగాహన కలిగి ఉండాలి ……………
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజిని
: సాక్షిత వనపర్తి
ఆరోగ్య పరకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనిశుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవo సందర్భంగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా నర్సింగాపల్లి లోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఆరోగ్య పథకాల మరియు ఆరోగ్య సూత్రాల పైన అవగాహన సదస్సు . కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి వి రజిని ఆ విధంగా పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పథకాల పైన అవగాహన కలిగి ఉండి వాటిని వినియోగించుకొని ఉచిత మరియు నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చు అని తెలిపినారు.
కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ జావిద్ మరియు డాక్టర్ మంజులతా శ్రీ ప్రజలకి పలు వైద్య సేవల గురించి మరియు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, మాతా శిశు సంరక్షణ మరియు ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన గురించి అవగాహన కల్పించారు. మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ హెల్ప్ డెస్క్ ఆసుపత్రి సుపరిండెంట్ సహకారంతో ఏర్పాటు చేసి, ప్రజలకి పలు వైద్య పథకాల పైన అవగాహన మరియు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య మరియు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పారా లీగల్ వాలంటీర్లు అనిల్, ప్రతాప్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
