అత్యుత్తమ సేవలకు సుధా బ్యాంకుకు 5 స్టార్ రేటింగ్..
సాక్షిత:
ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం.
మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్.
తమ బ్యాంకు ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను అంతర్జాతీయ హై క్వాలిటీ హైమ్ రేటింగ్ సంస్థ ఫైవ్ స్టార్ రేటింగ్ ప్రకటించిందని సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 26 ఏళ్లుగా 300 కోట్ల టర్నోవర్ తో 9 శాఖలలో ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా తక్కువ వడ్డీకే బంగారం, ఇండ్లు, వ్యక్తిగత, వ్యాపార రుణాలు అందిస్తున్నామని ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో
చైర్మన్ మీలా మహాదేవ్,వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్ర శేఖర్,డైరెక్టర్ లు తోట శ్యామ్, స్వామి వెంకటేశ్వర్లు,ఇరుకుల్ల చెన్న కేశవ రావు, వెంపటి వెంకట రమణ,బ్యాంక్ మేనేజర్ చెన్నూరు. రవి కుమార్, మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY