రైల్వే కోడూరు నియోజకవర్గం *
అస్వస్థతకు గురైన రాధాకృష్ణ ని పరామర్శించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో రాధాకృష్ణ ని పరామర్శించి..కుటుంబానికి ధైర్యం చెప్పిన యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పొడు అరుంధతి వాడకు చెందిన వేమ్మడి రాధాకృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి తిరుపతి లోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
వేమ్మడి రాధాకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి వివరంగా తెలుసుకున్న సాయి వికాస్ రెడ్డి , కుటుంబ సభ్యులను ఆత్మస్థైర్యంగా ఉండమని ప్రోత్సహించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లొ NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
