ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన: ఎంపీ చామల
జనగామ జిల్లా కేంద్రంలోని ఓం సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోవ్, ఆర్డీవోలు గోపిరామ్, వెంకన్న ఇతర అధికారులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

