తాడేపల్లిలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Sakshitha news

తాడేపల్లిలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పలు విషయాలను చర్చించారు.ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ఇటీవల వరుసగా నమోదవుతున్న అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు తదితర అంశాలను చంద్రశేఖర్ రెడ్డి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా సమస్యలపై రాష్ట్ర స్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోరాట పటిమను వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.రాబోయే శాసనమండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ముందుకు సాగాల్సిన విధానంపై వైయస్ జగన్‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Scroll to Top