మహిళా మహిళల సాధికారత దిశగా కూటమి ప్రభుత్వ పాలన
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మహిళలకు స్వయం ఉపాధి కల్పన మరియు మహిళా ప్రశ్రామికవేత్తలకు ప్రతేక ప్రోత్సాహకాలు. అందచేసి మహిళల సాధికారతకు కృషి చేయాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతిలోని శాసనసభ కమిటి హాలులో నిర్వహించిన సమావేశంలో ఆమె మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ సభ్యురాలి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, కార్యాచరణ గురించి వివరించారు.
అనంతరం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ చైర్మన్, పాణ్యం నియోజకవర్గం శాసన సభ్యురాలు చరిత రెడ్డి అధ్యక్షతన ఉచిత బస్సులో వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయింపు, ప్రతి పాఠశాల, కాలేజీల్లో మహిళల కోసం డిస్పెన్సరీలు మహిళల స్వయం ఉపాధి తదితర అంశాలపై చర్చించారు.సోషల్ మీడియాలో మహిళలపై తప్పుగా పోస్టులు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఫిర్యాదులు నమోదు చేయాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని తీర్మానించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం రౌండ్ ద క్లాక్ కమాండ్ సెంటర్లు మరియు ఉమెన్ ట్రాఫికింగ్ పై యాంటీ ట్రాఫికింగ్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
