టీడీపీలోకి MLC మర్రి రాజశేఖర్
సాక్షిత చిలకలూరిపేట: వైఎస్సార్‌సీపీకి చెందిన శాసనమండలి సభ్యుడు (MLC) మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరనున్నారు. గత కొన్ని నెలల క్రితమే వైఎస్సార్‌సీపీకి, తన MLC పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో, అనంతరం వైఎస్సార్‌సీపీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. అయితే, వైఎస్సార్‌సీపీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని, అలాగే ఆ పార్టీ అధినేత జగన్ పనితీరు నచ్చకపోవడం వల్లే పార్టీ మారుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
