పాఠశాల ను పరిశీలించి న MEO సత్యనారాయణ సింగ్
రికార్డులను పరిశీలించిన బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపాల్
సాక్షిత ::విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలని చిలకలూరిపేట విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సింగ్ తెలిపారు బుధవారం పట్టణంలోని కుమ్మరి కాలనీలో ఉన్న మున్సిపల్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించారు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులను కోరారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెడుతున్న అధునాతన వసతుల గురించి విద్యార్థులకు వివరించి వారి భవిష్యత్తుకు దోహదపడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపల్ పోలేరమ్మ మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊస సుబ్బారావు లతోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
