మేఘన హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి :
వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మేఘన ఆసుపత్రిని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ జర్నల్ సెక్రెటరీ బ్రహ్మం చారి, రమేష్ నూతనంగా ఈఆసుపత్రిని ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి ఆస్పత్రులు ఎంతో అవసరమని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వచ్చే వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని సూచించారు
వైద్యాన్ని వ్యాపార భావంతో కాకుండా సేవా భావంతో చేయాలని భగవంతుడి తర్వాత భగవంతుండ చూసేది కేవలం వైద్యులను మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
