“రోడ్డు ప్రమాదంలో గాయపడిన కంకణాల రాజును పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….

Sakshitha news

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కంకణాల రాజును పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 4వ. డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త కంకణాల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో చికిత్స కొనసాగిస్తే త్వరగా కోలుకుని మునుపటిలాగే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, అవసరమైన సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top