వల్లూరు మండలం మిట్టపల్లి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించి, వారికి అందుతున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. అనంతరం వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం నియోజకవర్గ అబ్జర్వర్ పత్తి హిమబిందు గారు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


