ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్లోని పద్మావతి కన్వెన్షన్ లో ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి బి.ఆర్.ఎస్.ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు. చిన్న వయసులోనే లక్ష్య నిర్ధారణ చేసుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల భయం (Exam Anxiety)ను ఎలా అధిగమించాలి, పదవ తరగతి అనంతరం సరైన కెరీర్ మార్గం ఎంపిక, పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానాలు, SSC మరియు ఇంటర్మీడియట్ తర్వాత అకాడమిక్ ప్రణాళిక, ఇంజనీరింగ్ మరియు వైద్య రంగాలలో అవకాశాలు, పోటీ పరీక్షలకు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు అవగాహన కల్పించారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా విద్యారంగానికి తనవంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు..
ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MEO జెమినీ కుమారి, మోటివేషనల్ స్పీకర్ బాలలత మల్లవరపు, ట్రస్మా అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు రమేశ్వర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, ట్రస్మా కుత్బుల్లాపూర్ అధ్యక్షులు వినోద్, చైర్మన్ కోలా వెంకటేష్ ముదిరాజ్, దయాకర్, వివిధ పాఠశాలల కరెస్పాండంటులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ విజయ్ రామ్ రెడ్డి, విజయ్ రామ్ రెడ్డి, కస్తూరి బాలరాజు, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, అజయ్ ప్రసాద్, చెట్ల వెంకటేష్, సుంకరి చందు, ఇమ్రాన్ బేగ్, శివ నాయక్, తారా సింగ్, మహేష్, చందు గౌడ్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, మాక్సూద్ భాయ్, వేణు యాదవ్, సిద్ధికి, అబ్దుల్ వహీద్, ఆరవ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

