పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే
సాక్షిత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామంలో కోటగిరి సత్యంబాబు సోదరుడు కోటగిరి నరసింహారావు అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు నేత్రాలను నేత్రనిధికి దానం అందించినందుకు అతని కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏన్కూరు మండలం నాచారం గ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులు బొల్లి గోపాలరావు అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి 69 వ అండర్ 14,17,19 విభాగాల రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

