కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన : ఎమ్మెల్యే జారే

Sakshitha news

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన : ఎమ్మెల్యే జారే

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండల కేంద్రంలో
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృత్వం వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాబోయే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీలతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామపంచాయతీలలో వేగంగా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీ చండ్రుగొండ ప్రధాన వీధుల్లో కొనసాగి నాయకులలో నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top