హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్య బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జారే
ఎల్డీసీ ద్వారా ఉచిత ట్రీట్మెంట్ అందేలా చేస్తా ధైర్యంగా ఉండండి
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారిగూడెం కి సంబందించిన వెదర్ల కిరణ్ కుమార్, రామనగరం (నాచారం)కి సంబందించిన నక్క మనీషా వివిధ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా వారిని పరామర్శించి ప్రస్తుత వారి ఆరోగ్య వివరాలు పరిశీలించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ట్రీట్మెంట్ వైద్యఖర్చుల కోసం భయపడవద్దన్నారు. ఎల్ ఓసి ద్వారా పూర్తి చికిత్స ఉచితంగా అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
