ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కోసం వినతి పత్రం: ఎమ్మెల్యే జారే
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే జారే
*సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట,దమ్మపేట,మందలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ల అభివృద్ధి కోసం వినతి పత్రం అందించారు.
అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని వారి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలసి నియోజకవర్గ అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మపేట, మందలపల్లి బస్టాండ్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని, అలాగే అశ్వారావుపేట పట్టణంలో మినీ బస్టాండ్ ను ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాల్సిందిగా రవాణా శాఖ మంత్రిని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
