జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు అండగా మంత్రి తుమ్మల

Sakshitha news

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు అండగా మంత్రి తుమ్మల

*జూబ్లీహిల్స్ అభివృద్ధికి మంత్రి తుమ్మల హామీ

*మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
*నవీన్ యాదవ్ ను అభినందించిన మంత్రి తుమ్మల

సాక్షిత న్యూస్, నవంబర్ 16, జూబ్లీహిల్స్

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గలో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ… ప్రజలకు మరింత సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదంతో… జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని… అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక నేతలు..కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top