మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధ్యక్షుడు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ *.
సాక్షిత : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన కూన శ్రీనివాస్ గౌడ్ కి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిలుగా నియమితులైన రాము గౌడ్, జిమ్మీ దేవేంద మరియు కార్యదర్శిలుగా నియమితులైన మోటె శ్రీనివాస్ యాదవ్, బొబ్బ రంగారావు బుచ్చి రెడ్డి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన బాలప్ప, ఎర్వ వెంకట్ రమణా ను షాపూర్ నగర్ లోని నివాసంలో *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ * శాలువాతో సత్కరించి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులంతా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అదేవిధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY