పరమశివుని దివ్య ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి – మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.
మహాశివరాత్రి సందర్భంగా మంటాడ శివాలయంలో వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన రాజేంద్రప్రసాద్
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ….
ముల్లోకాలను ఏలేటువంటి ముక్కంటి పరమశివుడు అని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారని, ప్రభుత్వం కూడా అన్ని శివాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని పరమశివుని ఆశీస్సులతో మనమందరం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, తెదేపా నాయకులు రత్నం బుజ్జి, గుర్రాల సాయి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY