ఆపదలో ఉన్న కుటుంబానికి మాతృదేవోభవ సొసైటీ ఆర్థిక సహాయం..

సాక్షిత :కోదాడ పరిధిలో సాలార్జంగ్ పేటలో ఇటీవల గ్యాస్ లీకేజీ కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన షేక్ నాగుల్‌ను సొసైటీ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడికి రూ. 20,000 ఆర్థిక సహాయం నగదు తో పాటు దుస్తులు వంట సామాగ్రి అందజేశారు
ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి ఓరుగంటి రమాదేవి, కోశాధికారి ఇమ్మడి సతీష్ బాబు మాట్లాడుతూ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసి, బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని సమన్వయం చేసిన తొడుపునూరి మంజుల మాట్లాడుతూ, బాధితుల పరిస్థితి తెలిసిన వెంటనే స్పందించి సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ, కార్యదర్శి ఓరుగంటి రమాదేవి, కోశాధికారి ఇమ్మడి సతీష్ బాబు, డైరెక్టర్లు తొడుపునూరి మంజుల, కొండూరు మాధవి, వంకాయల స్వాతి, బండారు శ్రీనివాసరావు, వెంపటి ప్రసాద్, గరినే శ్రీనివాసరావు, జగని ప్రసాద్, ముక్కా సుశీల, వార్డు నాయకులు శోభన్, వార్డు ఇంచార్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY