కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు…
కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే KR నాగరాజు …
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు.14వ డివిజన్ ఎస్ఆర్ నగర్,బాలాజీ నగర్ కు చెందిన సుమారు 250 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున బీఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు.పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకి తీసుకెళ్లాలని సూచించారు.ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలకు తగిన రీతిలో జవాబు చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, కూడా వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,డివిజన్ అధ్యక్షులు ఇంతియాజ్,ఎస్ఆర్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు స్టాలిన్,వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి,మాజీ కార్పొరేటర్ సులోచన సారయ్య,3వ డివిజన్ అధ్యక్షులు జన్ను కరుణాకర్,డివిజన్,మండల,గ్రామ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
