చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు….

Sakshitha news

చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు చట్టపరంగా న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి సీపీ నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇలా వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత భరోసా, విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని సాధ్యమైనంత త్వరగా చట్ట పరిధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Scroll to Top