పస్తాల గ్రామానికి మహర్దశ : ఎమ్మెల్యే

Sakshitha news

పస్తాల గ్రామానికి మహర్దశ : ఎమ్మెల్యే

సాక్షిత తుంగతుర్తి ప్రతినిధి : నాగారం మండలం పస్తాల గ్రామానికి మరికొద్ది రోజుల్లో మహర్దయ పట్టిందని తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత పది ఏండ్లలో ఏలాంటి అభివృద్ధికి నోచుకోక, గ్రామ అభివృద్ధిలో వెనకబడిన గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. పస్తాల గ్రామ ఎక్స్ రోడ్ నుండి గుండపురి గ్రామం వరకు రోడ్డు శాంక్షన్ , అలాగే ఎస్సీ కమిటీ హాల్ నుండి పసునూరు మెయిన్ రోడ్డు వరకు బడి పిల్లల భవిష్యత్తు బాట వేయడానికి పునాది వేశారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏడవ తరగతి వరకు, స్థానికంలో ఉన్న ఎస్సీ కాలనీ లోని మిగిలిన సిసి రోడ్ల పూర్తి కోసం అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకున్నారు. పస్తాల గ్రామంతో అనుబంధం నా గెలుపుకు ప్రతిక్షణం నా వెంట ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించిన అత్యధిక మెజార్టీతో గెలిపించిన పస్తాల గ్రామానికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. అన్నివేళలా ఈ గ్రామాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, సీఐ, డీఈ, గ్రామ శాఖ అధ్యక్షులు బండ గొర్ల కుమారస్వామి, నరేందర్, మహేష్ మాజీ ఎంపీటీసీ బండగర్ల నరేష్, బుక్క శ్రీనివాస్ వెంకట్ రెడ్డి, వేణు, బొజ్జ ఇస్తారి, బొజ్జ వెంకటేశ్వర్లు, బొజ్జ మల్లయ్య, కండే ఎల్లయ్య, బొజ్జ బజార్ విక్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.