నాదెండ్ల భాస్కరరావు మృతికి ఎం. రాధాకృష్ణ నివాళి
సాక్షిత చిలకలూరిపేట:మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్థివ దేహానికి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎం. రాధాకృష్ణ హైదరాబాద్‌లో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ భాస్కర్ రావు తనకు రాజకీయ గురువు అని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ను పరామర్శించి, ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

