*చేనేత దుస్తులు ధరిద్దాంచేనేత కార్మికులను కాపాడుదాం …

Sakshitha news

చేనేత దుస్తులు ధరిద్దాం
చేనేత కార్మికులను కాపాడుదాం …

జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్ నందు జిల్లా చేనేత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు , జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ గారు హాజరయ్యారు.

ముందుగా పాత బస్టాండ్ నుండి ర్యాలీ కి జెండా ఊపి ప్రారంభించిన అనంత ఫంక్షన్ హాల్ వరకు ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు చేనేత కార్మికులు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

చేనేత కార్మికులు నిర్వహించిన స్టాల్స్ ను ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

సీనియర్ చేనేత కార్మికులను ఎమ్మెల్యే గారు శాలువా ప్రశంసా పత్రం మెమొంటోతో ఘనంగా సత్కరించారు…

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత వస్త్రలతో వివిధ కళాశాల విద్యార్థి విద్యార్థి ఫ్యాషన్ షో నిర్వహించారు.

అదేవిధంగా ఫ్యాషన్ షో లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు…

జాతీయ చేనేత దినోత్సవ పురస్కరించుకొని వివిధ పాఠశాల లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన వారికి ఎమ్మెల్యే గారు చేతుల మీద ప్రశంసా పత్రం , మెమొంటో తో అందజేశారు .