చెట్లను నాటి వాటిని పరిరక్షిద్దాం…. భావితరాలకు స్వేచ్ఛా వాయువును అందజేద్దాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
సాక్షిత : 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ ఏ.పీ.హెచ్.బి కాలనీలోని జిహెచ్ఎంసీ పార్క్ – 1 లో ఏ.పీ.హెచ్.బి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అటవీశాఖ వారు ఏర్పాటుచేసిన వన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై చెట్లను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. భావితరాలకు స్వేచ్ఛా వాయువును అందించేందుకు ప్రతీ ఒక్కరూ చెట్లను నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, డీసీ నర్సింహా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘువీర్ రెడ్డి, హార్టికల్చర్ యూబీడీ దివ్య, సీఐ నరసింహ రాజు, ఏ.పీ.హెచ్.బి కాలనీ వాసులు ఎర్వ సాయికిరణ్ (బంటి), భాష, జగన్, రత్తయ్య, రమణయ్య, సుధాకర్ రావు, వెంకట్ రెడ్డి, ఓం ప్రకాష్, స్థానిక నాయకులు ఎర్వ శంకరయ్య, సుధాకర్, ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, కార్తీక్ గౌడ్, సతీష్ గట్టోజీ, తారక రాణి, ఈశ్వరి, బాలు నేత, కొండ శ్రీను, గౌస్, అల్లావుద్దీన్, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
