KVR వ్యాలీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

KVR వ్యాలీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: 296వ డివిజన్ దుండిగల్ పరిధిలోని KVR వ్యాలీ (KVR Valley)*లో సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కాలనీ వాసులు *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) నిధుల ద్వారా రూ.28 లక్షలు మంజూరు చేయించి, నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చెవిటి శ్రీనివాస్, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ రఫియా బేగం, డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ రెడ్డి, మహేందర్ యాదవ్, కావలి శశికుమార్, పద్మారావు, ఆలేటి శ్రీనివాస్, మల్లంపేట్ ప్రకాష్, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.