మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన…………. *మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఐజయ్యనగర్ వార్డుకు చెందిన గొల్ల బాలస్వామి కుమారుడు ప్రకాష్ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని , ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోపాటు ఆయన వెంట కూతురు తేజస్విని మరియు నాయకులు వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్,సయ్యద్.జహంగీర్,బాగ్యరాజ్,అరుణ్ యాదవ్,ఇమ్రాన్,ముని కుమార్,అలీమ్ రఘు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు ఉన్నారు.
