కార్మిక సంక్షేమమే లక్ష్యంగా నిరంతర పోరాటం, ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, ఆర్జీవన్ ప్రాంత పరిధిలోని జీడీకే–1 బొగ్గు శుద్ధి కేంద్రంలో కార్మికుల సమక్షంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కార్యాచరణ చేపడతామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాదాసు రామ్మూర్తి, ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, కోశాధికారి చెల్పూరి సతీష్, దూత శేషగిరి, పుప్పాల రవీందర్, అఫ్సర్ భాష, పులిపాక శంకర్, సుసమని అనురాగ్, మల్లారెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్, శ్రీనివాస్ రెడ్డి, క్రాంతి, రమేష్‌కుమార్ తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
