విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
సాక్షిత : బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసినా కోవూరు ఎమ్మెల్యే
10వతరగతి విద్యార్థినిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు..
నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులు ఆరుబయట కూర్చుని భోజనం చేయడంచూసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి త్వరలోనే పాఠశాల ఆవరణలో అత్యాధునిక డైనింగ్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు గౌరవప్రదంగా కూర్చుని భోజనం చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. భోజన నాణ్యతను పరీక్షించేందుకు ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థినుల మధ్య కూర్చుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
వంటకాల రుచి, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతుల కల్పనకృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ యిచ్చారు.అనంతరం 10వ తరగతి విద్యార్థినిలతో పరీక్షలు అంటే భయం వద్దు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మంచి పేరు తేండిని తెలియజేశారు. వారితో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, సాయితేజ తేజ రెడ్డి, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY