చైతన్యానికి మారుపేరుగా కోదాడ పబ్లిక్ క్లబ్ నిలవాలి…*మార్చి 15: (సాక్షిత)
విజ్ఞానం ,వినోదం , ఆనందం లక్ష్యాలను క్లబ్ నెరవేర్చాలి.
కోదాడ పబ్లిక్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం లో ఏక గ్రీవ తీర్మానాలు.
నూతన పాలక వర్గం ఎన్నిక కు నామినేషన్ లు.
చైతన్యానికి మారుపేరుగా కోదాడ పబ్లిక్ క్లబ్ నిలవాలని పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు పట్టాభి రెడ్డి అన్నారు. ఆది వారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. విజ్ఞానం వినోదం ఆనందం లక్ష్యాలతో ఏర్పడ్డ క్లబ్ ఆ లక్ష్యాలను ముందుకు సాగే విధంగా సభ్యులు సహకరించాలన్నారు.
క్లబ్ సామాజిక సేవలను ముందుకు తీసుకెళ్ళాలన్నారు.ఈ సందర్భంగా గత రెండేళ్ల కాలంలో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జమాఖర్చుల వివరాలను కార్యదర్శి నివేదికలో కార్యదర్శి రాంబాబు సభ్యుల ముందు చదివి వినిపించారు. కార్యదర్శి నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా చప్పట్లతో ఆమోదించారు. నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారిగా ఎస్ ఆర్ కె మూర్తి వ్యవహరిస్తూ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలు పదవులకు పలువురు నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ క్లబ్ సభ్యులు ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, చిన్నపరెడ్డి, ఆవుల రామారావు, భారత రెడ్డి, సత్తిబాబు, రామిరెడ్డి, వేనేపల్లి సత్యనారాయణ, వేణుగోపాలరావు, కారు మంచి సత్యనారాయణ, వేనేపల్లి వెంకటేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరావు, ఎయిర్ ఫోర్స్ వెంకట్ రెడ్డి, కొత్త బ్రహ్మయ్య, కత్రం సీతారాం రెడ్డి,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY