సంక్రాంతి పండుగకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో కోదాడ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుండి వచ్చే ప్రయాణికులు ఇక్కడ బస్సులు మారుతుండటంతో పాటు, స్థానికంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు భారీగా తరలివచ్చారు. బస్టాండ్ ఆవరణ అంతా జనసందోహంతో నిండిపోయింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, రద్దీ నియంత్రణ కష్టంగా మారింది. ప్లాట్‌ఫారమ్‌లన్నీ ప్రయాణికులతో నిండిపోవడంతో ఎక్కడ చూసినా పండుగ కోలాహలం కనిపిస్తోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
