కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ అసెంబ్లీ మరియు చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్….
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్ నియోజకవర్గం మరియు చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో లొ ఏర్పాటు చేయడం జరిగింది…
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు చొప్పదండి నియోజకవర్గం లో లొ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి స్థానిక నాయకులకు పలు సలహాలు సూచనలు తెలియజేయడంతో పాటు డివిజన్ కమిటీలు మరియు మండల కమిటీలు బలోపేతం చేయాలని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోయే సర్ (SIR) కార్యక్రమం పై అవగాహన సదస్సు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు…
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ SIR కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు జరగకుండా చూడాలని నకిలీ ఓట్లను తొలగించే విధంగా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి తెలియజేశారు..
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు…..
ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు & కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం , కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ , జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ సత్తు మల్లేశం కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
