అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యా విస్తరణకు చేసిన జ్యోతిరావ్ పూలే చేసిన సేవలు చిరస్మరణీయం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
130 – సుభాష్ నగర్ డివిజన్ జీడిమెట్ల బస్ డిపో, సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్ లలో మహిళా విద్యా విస్తరణకై పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిబాపూలే విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళి అర్పించారు. అదేవిధంగా సూరారం 60 గజాలు, తెలుగు తల్లి నగర్ లలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యా విస్తరణకు చేసిన జ్యోతిబా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వారు చూపిన మార్గంలో నేటి యువత పయనించి విద్యా, సమాన హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ఆర్టీసీ డిపో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోళ్ల రాజు గౌడ్, కార్యదర్శి ముద్దా మహేష్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్, సభ్యులు కృష్ణ, నాగరాజ్, నరసింహ, కవిత, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ పోలే శ్రీకాంత్, దుండిగల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, సీనియర్ నాయకులు వారాల వినోద్, గుబ్బల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్, ప్రభాకర్, యూసుఫ్, ఏవి శేషాచారి, శ్రీనివాస్ రెడ్డి, తారా సింగ్, మంగ, చందు, కరాటే శ్రీను, కోల శ్రీకాంత్, వేణు ముదిరాజ్, కైసర్ బాషా, సాయిరాం రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY