సాక్షి ఎడిటర్‌కి మద్దతుగా అశ్వారావుపేటలో విలేకరుల నిరసన
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం, (తెలంగాణం ): ఏపీ ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులు, విచారణ పేరుతో జరిగిన నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా అశ్వారావుపేటలో విలేకరులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని రింగ్ సెంటర్ మూడు రోడ్ల కూడలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్థానిక మీడియా రిపోర్టర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ దమనకాండను తక్షణం ఆపాలని, విలేకరులపై జరుగుతున్న వేధింపులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
వార్తా స్వేచ్ఛ కాపాడాలి
విలేకరులపై దమనకాండ ఆపాలి అంటూ పాకార్లు చేస్తూ నిరసనకారులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. విలేకరుల హక్కులు, స్వేచ్ఛను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు స్థానిక పాత్రికేయులు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
